చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా !

Telugu Lo Computer
0


టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో సీఐడీ తనపై నమోదుచేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు 10వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదితో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్‌ మను సింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పిటిషన్‌పై మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు రోహత్గీకి ధర్మాసనం అనుమతి ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)