హైటెన్షన్‌ విద్యుత్ వైరు తగిలి లారీ దగ్ధం : భార్యాభర్తలు, ఆరేళ్ల చిన్నారి సజీవ దహనం !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని అర్వల్లి జిల్లాలో రాజస్థాన్‌కు చెందిన ఒక కుటుంబం సుమారు 150 మేకలు, గొర్రెలను ఒక లారీలో రవాణా చేస్తూ అందులో ప్రయాణించారు. గుజరాత్‌లోని బమన్‌వాడ గ్రామానికి వెళ్తుండగా సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఆ లారీకి హెటెన్షన్ విద్యుత్‌ వైర్లు తగిలాయి. దీంతో మంటలు రాజుకోవడంతో లారీ కాలిపోయింది. అందులో ఉన్న భార్యాభర్తలు, వారి ఆరేళ్ల కుమార్తె సజీవ దహనమయ్యారు. 150 జీవాలు కూడా కాలి మరణించాయి. కాగా, ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్‌ లారీని మేత భూమి వైపు తీసుకెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. సజీవ దహనమైన దంపతుల వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని చెప్పారు. మృతులు ఎవరన్నది ఇంకా గుర్తించలేదని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)