రద్దీగా ఉన్న ట్రైన్లో ఓ చిన్నారి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త ఇంటర్ నెట్ ను షేక్ చేసింది. రాయల్ బ్లే డ్రస్ ధరించిన ఆ చిన్నారి భోజ్‌పురి సాంగ్ కు మెలికలు తిరుగుతూ ఆమె ప్రదర్శించిన తీరు చూస్తే ఎంతో నైపుణ్యం ప్రదర్శించిందని నెటిజన్లు కామెంట్ చేశారు. భోజ్‌పురి సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాట మీద ఎంతోమంది డాన్స్ చేస్తూ రీల్స్ చేశారు. దాంతో ఈ సాంగ్ మరింత పాపులర్ అయిపోయింది. చిన్న,పెద్ద తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పలు వేశారు. అయితే ఇలాంటి డాన్స్ మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ప్రస్తుతం ఈ భోజ్‌పురి పాటకు ట్రైన్ లో ఓ చిన్నారి చేసిన డాన్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. ఈ వీడియోను X ట్విట్టర్ లో squint Neon ఖాతా నుంచి పోస్ట్ చేయబడింది. పోస్ట్ కొద్దిరోజులకే 562k మంది వీక్షించడంతో వైరల్ గా మారింది. బ్లూ డ్రస్ వేసుకున్న చిన్నారి డ్యాన్స్ చేయడంతో కొంతమంది వీడియో తీసి ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. కొంతమంది జీవితంలో విశ్వాసం అవసరం అని కామెంట్ చేయగా మరికొంతమంది ఆ చిన్నారి నమ్మకాన్ని ప్రశంసించారు. ఇంకొంతమంది ఆ చిన్నారి ప్రదర్శించిన బెల్లి డ్యాన్స్ తీరు, వినోదం, విశ్వాసం, నైపుణ్యం ఇలా అన్నీ పరిశీలిస్తే 10/10 అని భావిస్తున్నానని రాసుకొచ్చారు.
భోజ్‌పురి పాటకు చిన్నారి డాన్స్ : నెటిజన్లు ఫిదా !
October 09, 2023
0
Tags