మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఎస్ఐ సోమ్‌నాథ్ జెండే డ్రీమ్ 11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. మూడు నెలలుగా సోమ్‌నాథ్ డ్రీమ్ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే, భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఇంగ్లాండ్- బంగ్లాదేశ్ మ్యాచ్‌లో సోమ్‌నాథ్ బెట్టింగ్ వేశారు. మ్యాచ్‌లో ఉత్తమంగా ఆడిన ప్లేయర్లతోనే టీమ్‌ను ఎంపిక చేసుకున్న ఆయన ఫాంటసీ గేమ్‌లో అగ్రస్థానంలో నిలిచి రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. దీంతో ఆయన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. "కొన్ని నెలలుగా డ్రీమ్ 11లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. ఇంతవరకు సక్సెస్ కాలేకపోయాను. మంగళవారం కూడా డ్రీమ్ 11 టీమ్‌ను ఎంచుకున్నాను. ఆ తర్వాత నా టీమ్‌లో టాప్‌లోకి వచ్చింది. వెంటనే రూ.1.5 కోట్ల గెలుచుకున్నట్లు మెసేజ్ వచ్చింది. మొదట దానిని నమ్మలేదు. తర్వాత నమ్మాను. మొత్తానికి చాలా సంతోషంగా ఉంది" అని సోమ్‌నాథ్ జెండే తెలిపారు. అయితే నిబంధనలకు అతిక్రమించి పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ ఎస్ఐ సోమ్‌నాథ్ జెండేను విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏసీపీ సతీశ్ మానే ప్రకటించారు. కోటిన్నర గెలుచుకుని వార్తల్లో నిలిచిన ఆయన, సస్పెండ్ అయ్యి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అక్టోబర్ 10న విధుల్లో ఉండి ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్‌పై బెట్టింగ్‌లో పాల్గొన్నాడని పోలీసులు చెప్పారు. దీంట్లో ప్రథమ స్థానంలో నిలిచిన సోమ్‌నాథ్ రూ.కోటిన్నర గెలుచుకున్నారు. పోలీసులే బెట్టింగ్‌కు పాల్పడడం వల్ల వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన పోలీసు శాఖ విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తి చేసిన అధికారులు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి శాఖపరమైన విచారణ బాధ్యతలను డీసీపీకి అప్పగించారు.
ఆన్ లైన్ బెట్టింగ్ లో రూ.కోటిన్నర గెలిచిన ఎస్ఐ - నిబంధనలను అతిక్రమించారంటూ సస్పెండ్ !
October 18, 2023
0
Tags