ప్రధాని మోడీ తన పుట్టిన రోజు సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ద్వారకాలో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ పొడిగింపు కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ప్రధాని తమతో ప్రయాణించడంతో అక్కడున్న వారంతా ఆనందంతో చప్పట్లు కొడుతూ ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వారితో ఆయన కాసేపు ముచ్చటించారు. ప్రయాణికులు మోడీతో సెల్ఫీలు దిగారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ఓ బాలుడికి ప్రధాని చాక్లెట్‌ను ఇచ్చారు. అంతేకాకుండా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సిబ్బందితో ఆయన మాట్లాడారు. ఇదిలా ఉండగా పుట్టిన రోజు సందర్భంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సెక్టార్ 21 స్టేషన్ నుంచి యశోభూమి సెక్టార్ 25 స్టేషన్ వరకు 2 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ లైన్ పొడిగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో మొత్తం పొడవు 24. 9 కిలోమీటర్లు ఉంటుందని డీఎమ్‌ఆర్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం ద్వారకాలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించారు.
ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ప్రధాని !
September 17, 2023
0
Tags