రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మృతి

Telugu Lo Computer
0


హారాష్ట్ర లోని అమరావతి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారాంతం కావడం చేత స్నేహితులందరు చికల్ ధర వెళ్లేందుకు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా భీం పూర్ నుండి బస్సుల్లో బయలు దేరారు. కొంత దూరం ప్రయాణించాక అమరావతి సమీపంలో బస్సు అదుపుతప్పి లోయలో పడి పోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా బస్సులో భీంపూర్ మండలానికి చెందిన యువకులతో పాటు బ్యాంక్ లో క్యాషియర్ పనిచేసే ఉద్యోగులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటన పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పైన పోలీసులు మాట్లాడుతూ బస్సు లోయలో పడిందని, దీనితో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా ఏడుగురికి  తీవ్ర గాయాలు అయ్యాయని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)