మిస్ ఫైర్ తో జవాన్ మృతి !

Telugu Lo Computer
0


జమ్మూ కశ్మీర్ లో గన్ మిస్ ఫైర్ అయి ఓ ఆర్మీ జవాన్ మృతి చెందాడు. బందిపోరా జిల్లాలోని ఆర్మీక్యాంపులో 14 రాష్ట్రీయ రైఫిల్స్ కి చెందిన ఓ జవాన్ తన తుపాకీతో పొరపాటున కాల్పులు జరిపాడు. తుపాకీ గుళ్లు మరో ఆర్మీ జవాన్ వైపు దూసుకువచ్చి శరీరంలోకి చొచ్చుకుపోయాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. యోగేష్ అనే మరో జవాన్ కు సైతం తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన జవాన్ వివరాల్ని ఆర్మీ ఆఫీసర్లు ఇంకా వెల్లడించలేదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)