తమిళ నటుడు విజయ్ ఆంటోనీ, ఫాతిమా దంపతుల పెద్ద కుమార్తె మీరా. ఆమె 2007లో జన్మించింది. డాక్టర్ అవ్వాలన్నది ఆమె కల. అదే ఆకాంక్షతో చెన్నైలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. మీరా తన చదువులో టాపర్. ఆమె ఇటీవల పాఠశాలలో కల్చరల్ సెక్రెటరీగా ఎన్నికైంది.మీరా గత కొన్ని నెలలుగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు, అందుకు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 19న మీరా గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకోని ఆత్మహత్య చేసుకుంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మీరాది ఆత్మహత్య అని తేలింది. పోలీసులు మీరా సూసైడ్ నోట్‌ను గుర్తించారు. 'లవ్ యూ ఆల్, మిస్ యూ ఆల్' అనే కోట్‌తో ఆమె లెటర్ రాసినట్లు తెలిసింది. ఈ లేఖ గురించి పోలీసు అధికారులు పెద్దగా వెల్లడించలేదు. మీరా ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. అశ్రునయనాల మధ్య కీల్పాక్కంలోని శ్మశానవాటికలో మీరా అంత్యక్రియలు గురువారం ముగిశాయి. మంత్రి ఉదయనిధి స్టాలిన్, నటుడు కార్తీ, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, ప్రభుదేవా సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మీరాకు నివాళులర్పించారు. మీరా చదువుకున్న పాఠశాల విద్యార్థులు మీరాను ఆఖరి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్జీవంగా ఉన్న మీరాను చూసి తన ఫ్రెండ్స్ కన్నీరు పెట్టుకున్నారు. విజయ్ ఆంటోని భార్య ఫాతిమా తన కుమార్తె గురించి సోషల్ మీడియాలో పెట్టిన ఓ త్రోబాక్ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
మీరా సూసైడ్ నోట్‌ను కనుగొన్న పోలీసులు !
September 21, 2023
0
Tags