రైల్వే ఫోర్టర్ గా మారిన రాహుల్ గాంధీ !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని ఆనంద్ విహారి రైల్వే స్టేషన్‌లో కూలీలతో రాహుల్ గాంధీ గురువారం ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సవాళ్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం రైల్వే కూలీల ట్రేడ్‌మార్క్ రెడ్ టీషర్ట్ ధరించారు. తలపై లగేజీ పెట్టుకుని కొంత దూరం మోశారు. ఇదిలావుండగా రైల్వే కూలీల సమస్యలు కూడా వినాలని కొన్ని నెలల క్రితం అభ్యర్థించడంతో రాహుల్ గురువారం వారి దగ్గరకు వెళ్లారు. ఇదిలావుండగా భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ విభిన్న వర్గాల సమస్యలను తెలుసుకున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు విభిన్న వర్గాలను కలిసి మాట్లాడిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)