తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసా మార్కెట్‌లో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు మరోసారి పెరిగాయి. రెండు వారాలుగా కొంత వరకు తగ్గిన ధరలు మళ్లీ పుంజుకున్నాయి. నాణ్యమైన ఉల్లి ధర క్వింటాల్ గరిష్టంగా రూ.2,100, రెండో రకం ఉల్లి ధర కనిష్టంగా రూ.1,400 నుంచి రూ.1,950 వరకు పలికాయి. ఇక చిన్న సైజు ఉల్లి క్వింటాల్ ధర గరిష్టంగా రూ.1,100, కనిష్టంగా రూ.700 వచ్చింది. వేలంలో కొనుగోలు చేసిన ఉల్లిని 45 కిలోల బస్తాలుగా తూకం వేసి అమ్మకాలు సాగించారు. బస్తా ధర గరిష్టంగా రూ.1,100 పలుకగా కనిష్టంగా రూ.700 వరకు పలికింది. చిన్నసైజు ఉల్లి బస్తా ధర రూ.600 నుంచి రూ.400 విక్రయించారు. చిరు వ్యాపారులతోపాటు వినియోగదారులు బస్తాలుగా ఉల్లిని కొనుగోలు చేశారు. ఇక స్థానిక సంతలో కిలో ధర రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయించారు. మార్కెట్‌కు వస్తున్న ఉల్లి గత రబీ సీజన్‌లో పండించింది. గతంలో ధరలు లేకపోవడంతో చాలామంది రైతులు అమ్మకుండా నిల్వ చేసి ఇప్పుడు మార్కెట్‌కు తెస్తున్నారు. ప్రతివారం ధరలు బేరీజు వేసుకుని ఉల్లిని తెస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు.
పెరిగిన ఉల్లి ధర !
August 10, 2023
0
Tags