ఆగస్టు15 స్వాతంత్ర్య దినోత్సం సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కట్టుదిట్టం చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు హైఅలర్జ్ కొనసాగనుంది. ఈ మేరకు బుధవారం డీసీపీ నారాయణరెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో విమానాశ్రయంలోకి సందర్శకుల అనుమతి లేదని తెలిపారు. ప్రయాణికులకు స్వాగతం, వీడ్కోలు కోసం ఒక్కరు, ఇద్దరు మాత్రమే విమానాశ్రయానికి రావాలని సూచించారు. విద్యార్థులు, ఇతరులు విదేశాలకు వెళ్తున్న సమయంలో అత్యధిక రద్దీ నెలకొనడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. టెర్మినళ్ల దగ్గర ట్రాఫిక్ రద్దీ పెరుగుతుండటంతో కొంతమంది ప్రయాణికులు సమయానికి బోర్డింగ్ కాలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని వెల్లడించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్జ్ !
August 10, 2023
0
Tags