ఉత్తరప్రదేశ్ లోని సౌన్‌భద్ర జిల్లాలోని జుగైల్ ప్రాంతంలో స్నేహితులైన బాధితుడు జవహర్ పటేల్, నిందితుడు గులాబ్ కోల్ కలిసి పీకల వరకు మద్యం సేవించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన జవహర్ పటేల్, స్నేహితుడు గులాబ్ కోల్‌పై దాడి చేసి, ఆ తర్వాత మూత్ర విసర్జన చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధితుడు మద్యం మత్తులో ఉండటంతో ఏ జరిగిందో గుర్తించలేక పోయాడు. అయితే, ఈ ఘటనను ఓ వ్యక్తి తన మొబైల్ ఫోనులో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడితో పాటు అతని స్నేహితుడిని కూడా అరెస్టు చేశారు. https://t.me/offerbazaramzon
స్నేహితుడిపై మూత్ర విసర్జన !
July 14, 2023
0
Tags