వారాహి యాత్రలో వైకాపా కవ్వింపు చర్యలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం నాయకులు, వీర మహిళల సమావేశం ముగించుకుని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ర్యాలీగా తణుకు బయలు దేరారు. యాత్ర తేతలి గ్రామం చేరుకునే సమయానికి 20 మంది వైకాపా కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని రహదారికి అడ్డుగా వచ్చారు. జై జగన్‌.. జై వైకాపా అని నినాదాలు చేస్తూ యాత్రకు ఆటంకం కలిగించారు. వెంటనే పోలీసు ప్రత్యేక బృందాలు వారిపై లాఠీఛార్జి చేశారు. వైకాపా కార్యకర్తలు అక్కడి నుంచి పారిపోయారు. ర్యాలీ తేతలి చేరక ముందూ రెండుసార్లు ఆ కార్యకర్తలు వైకాపా జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. వారిని ఓ జనసేన కార్యకర్త ప్రశ్నించగా ఆగ్రహంతో ఊగిపోతూ అతనిపైకి దూసుకొచ్చి కొట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా నవ్వుతూ జనసేన కార్యకర్తకు సర్దిచెప్పారే తప్ప వైకాపా వారిని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేయలేదు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)