దుబాయ్‌లోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆర్కిటెక్చర్ గా పనిచేసున్న మహమ్మద్ అదిల్ ఖాన్ టైఖేరోస్ సంస్థ నిర్వహించిన ఫాస్ట్ 5 ఎమిరేట్స్ డ్రాలో మొట్టమొదటి విజేతగా నిలిచాడు. ఈ మేరకు కంపెనీ మార్కెటింగ్ హెడ్ పాల్ చాడర్ మాట్లాడుతూ ఈ డ్రా మొదలుపెట్టిన ఎనిమిది వారాల్లోపే మొట్ట మొదటి విజేతను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మెగా ఎమిరేట్స్ డ్రాలో విజేతగా ఖాన్ పేరును ప్రకటిస్తూ బహుమతిగా ఆయనకు 25 సంవత్సరాల పాటు నెలకు 25 వేలు దీనారాలు (రూ.5.59 లక్షలు) చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన ఖాన్ మాట్లాడుతూ ఈ నిజాన్ని నేను నమ్మలేకపోతున్నాను. మా ఇంట్లో వాళ్లకి ఈ విషయాన్ని చెబితే వారు కూడా నమ్మలేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమన్నారు. మా కుటుంబంలో నేనొక్కడినే పనిచేస్తుంటాను. మా అన్నయ్య కరోనా సమయంలో చనిపోయారు. అన్నయ్య కుటుంబాన్ని కూడా నేనే చూసుకోవాలి. వయసు మీదపడిన తల్లిదండ్రుల తోపాటు నాకొక ఐదేళ్ల పాప కూడా ఉందని, ఈ బహుమతి నాకు సరైన సమయంలోనే అందిందనుకుంటున్నానని అన్నాడు.
దుబాయ్ లాటరీలో జాక్‌పాట్ కొట్టిన భారత ఆర్కిటెక్చర్ !
July 29, 2023
0
Tags