ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె మార్కెట్‌లో టమోటా కొత్త రికార్డు సృష్టించింది. 45 ఏళ్ల మదనపల్లె మార్కెట్ చరిత్రలో ఇంత ధర పలకడం ఇదే తొలిసారి అంటున్నారు రైతులు, వ్యాపారులు. మదనపల్లె మార్కెట్‌లో ఏకంగా కిలో టమోటా ధర డబుల్ సెంచరీ దాటేసింది. ఈ రోజు కిలో టమోటా ధర 208 రూపాయలుగా పలికింది. 25 కేజీల టమోటా బాక్స్ ధర 5200 రూపాయిలు పలికింది. మరోవైపు సాధారణ మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.230 నుండి రూ.250 వరకు పలుకుతోంది.. మొత్తంగా 45 ఏళ్ల మదనపల్లె మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నయా రికార్డులను సృష్టించింది టమోటా ధర. అయితే, నార్త్ ఇండియాతో పాటు సౌత్ ఇండియాలోనూ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. https://t.me/offerbazaramzon
మదనపల్లిలో మార్కెట్ చరిత్రలో నయా రికార్డు !
July 29, 2023
0
Tags