బెంగళూరు నుంచి విజయవాడకు రెండు ప్రత్యేక రైళ్లు

Telugu Lo Computer
0


బెంగళూరు నుంచి విజయవాడకు రెండు ప్రత్యేక రైళ్ళను నడుపనున్నారు. ఈ మేరకు నైరుతి రైల్వే అధికారులు నగరంలో గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 03248 దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతి శనివారం రాత్రి 11-25కు ఎస్‌ఎంవిటి నుంచి బయల్దేరి వెళుతుంది. ఈ రైలు సేవలు జులై 22న ప్రారంభమై సెప్టెంబరు 2 వరకు కొనసాగుతాయి. కాగా 03260 దానాపూర్‌ వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌  ప్రతి గురువారం రాత్రి 11.25కు ఎస్‌ఎంవిటి నుండి బయల్దేరి వెళుతుందిఈ రైలు సేవలు జూలై 20న ప్రారంభమై ఆగష్టు 31 వరకు కొనసాగనున్నాయి. ఈ రెండు రైళ్ళు బంగారుపేట, జోలార్‌పేట, కాట్పాడి, పెరంబూరు విజయవాడ, వరంగల్‌ మీదుగా సాగుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ, వరంగల్‌ వైపు ప్రయాణించదలిచే తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ఈ సేవలను వినియోగించుకోవాలని, రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయని ప్రకటనలో తెలిపారు. తిరుగు ప్రయాణంలో 03247 రైలు బెంగళూరుకు శనివారం రాత్రి 1 గంటకు చేరుకోనుండగా 03259 రైలు గురువారం రాత్రి 1 గంటకు చేరుకోనుంది.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)