వరద నీటిలో సుప్రీం కోర్టు, రాజ్ ఘాట్ !

Telugu Lo Computer
0


ఢి
ల్లీని వరదలు  ముంచెత్తాయి. యమున నది శాంతించకపోవడంతో హస్తిన ఓ నదిలా మారింది. ఎటుచూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అధికారిక నివాసం, మంత్రుల ఇళ్లు, సచివాలయం సహా చారిత్రక కట్టడం ఎర్రకోట, రాజఘాట్ ను సైతం వరద ముంచెత్తింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు మేర నీరు చేరింది. పలు కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈ వరద సుప్రీంకోర్టు కాంప్లెక్స్ లోకి కూడా ప్రవేశించింది. మరోవైపు యమునా నదిలో వరద ఉధృతి కొంత మేర తగ్గినట్లు అధికారులు తెలిపారు. గురువారం రాత్రి 208.66 మీటర్లు ఉన్న నీటి మట్టం.. శుక్రవారం ఉదయం 6 గంటలకు 208.46కు తగ్గింది. మధ్యాహ్నం 1 గంటకు 208.30 మీటర్లు తగ్గొచ్చని కేంద్ర జల సంఘం అంచనా వేసింది. మరోవైపు వరదల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.   https://t.me/offerbazaramzon


Post a Comment

0Comments

Post a Comment (0)