అరుణాచల్ ప్రదేశ్‌ ఇండియాలో భాగమే !

Telugu Lo Computer
0


రుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని భారతదేశంలో అంతర్భాగంగా గుర్తిస్తూ అమెరికా కాంగ్రెస్ సెనెటోరియల్ కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని సెనేటర్లు జెఫ్ మెర్క్లీ, బిల్ హాగెర్టీ, టిమ్ కైన్, క్రిస్ వాన్ హోలెన్ గురువారం ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. కొన్ని వారాల క్రితం అమెరికాలో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ అంశంపై అధ్యక్షుడు జో బైడెన్ తో చర్చించారు. ఇండియా బార్డర్ లో చైనా సైన్యం ఆగడాల అంశాన్ని ఈసందర్భంగా బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఈనేపథ్యంలోనే అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని భారతదేశంలో అంతర్భాగంగా గుర్తిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటూ చైనా చేస్తున్న ప్రకటనలు వీగిపోయినట్టు అయింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)