సద్భావన ట్రస్టుకు ఫారీన్ కాంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (ఎఫ్‌సిఆర్‌ఎ) లైసెన్సును కేంద్రం రద్దు చేసింది. ఇది ఢిల్లీ కేంద్రంగా పని చేసే ఒక లాభాపేక్ష లేని సంస్థ (ఎన్జీవో). దళిత, ముస్లిం మహిళల కోసం పని చేస్తుంది. అయితే, కేంద్రం ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సును రద్దు చేయటంతో ఈ ఎన్జీఓకు పెద్ద దెబ్బ పడినట్టయింది. దీంతో ఆ ట్రస్టు విదేశీ నిధులను పొందటానికి అవకాశం ఉండదు. ఎస్బీఐలో ఎఫ్‌సీఆర్‌ఏ బ్యాంకు ఖాతాను తెరవటంలో విఫలమైనందునే ట్రస్టు ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సును రద్దు చేసినట్టుగా వెల్లడించటం గమనార్హం. అయితే, దళిత, ముస్లిం మహిళల హక్కుల కోసం పని చేసే ఈ ఎన్జీవోకు సంబంధించిన ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సును రద్దు చేయటం పట్ల సామాజిక, హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొనే కేంద్రంలోని మోడీ సర్కారు ఇలాంటి చర్యలకు దిగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎన్‌ఐ శిశు సంగోపన్ గృహ, ప్రోగ్రామ్ ఫర్ సోషల్ యాక్షన్ (పిఎస్‌ఎ) అనే రెండు ఎన్జీవోల లైసెన్సులను ఇటీవలనే కేంద్రం రద్దు చేసిన విషయం విదితమే. https://t.me/offerbazaramzon
సద్భావన ట్రస్టు ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్సు రద్దు !
July 11, 2023
0
Tags