మహారాష్ట్రలోని నాసిక్‌లో ఏటీఎం కేంద్రంలో చోరీ చేసేందుకు కొందరు దొంగలు వచ్చారు. అయితే, ఆ యంత్రం ఎంతకీ బద్ధలు కాకపోవడంతో ఏకంగా ట్రక్కులో ఎక్కించి దాన్ని ఎత్తుకెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. సమన్‌గావ్ ప్రాంతంలోని ఆర్‌పీఎఫ్ శిక్షణ కేంద్రానికి సమీపంలో ఇది జరగడం గమనార్హం. దొంగతనం దృశ్యాలన్నీ సీసీటీవీలో నమోదయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా దొంగలు ఏటీఎంను ఎత్తుకెళ్లే సమయానికి అందులో ఎంత నగదు ఉందన్నదానిపై స్పష్టత రావాల్సివుంది. https://t.me/offerbazaramzon
ఏటీఎం యంత్రాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు !
July 11, 2023
0
Tags