మహారాష్ట్రలోని నాందేడ్, హడ్గావ్ తాలూకాలో గల సప్తి అనే చిన్న గ్రామంలో వైష్ణవి దిగంబర్ కదమ్ అనే అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. వైష్ణవి ఎంఎస్ ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఎంఎస్‌డబ్ల్యూ పూర్తి చేసింది. చదువు పూర్తి కాగానే తన ఊరిలోనే గోదావరి అర్బన్ బ్యాంకులో ఉద్యోగంలో చేరింది. ప్రస్తుతం బ్యాంకు మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. మంచి పొజిషన్‌లో ఉండటంతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. నగరాల నుండి ఇంజనీర్లు, డాక్టర్లు, గవర్నమెంట్ ఉద్యోగస్థుల సంబంధాలను తల్లిదండ్రులు తెచ్చారు. అయితే తనకు రైతు కుమారుడ్ని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పింది. వాస్తవానికి వైష్ణవి తండ్రి వ్యవసాయం చేస్తూనే ఆమెను ఇంత చదివించారు. దీంతో ఆమెకు వ్యవసాయం అంటే ఇష్టం. ఈ కారణంతోనే రైతును వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. పూసాద్‌కు చెందిన నితిన్ పాటిల్ అనే రైతుతో వివాహం నిశ్చయించారు పెద్దలు. అతడికి 15 ఎకరాల పొలం ఉంది. ఈ ఆదివారం నాడు యావత్మాల్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వైష్ణవి తీసుకున్న నిర్ణయంపై అందరూ ఆశ్చర్యపోవడంతో పాటు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. https://t.me/offerbazaramzon
రైతును పెళ్లాడిన బ్యాంకు మేనేజర్ !
July 11, 2023
0
Tags