ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన వారు కాకినాడలో పెళ్లి రిసెప్షన్ కోసం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకున్నారు. బయలుదేరిన కొద్దిసేపటికే బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ కాలువలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో అబ్దుల్ అజీజ్, అబ్దుల్ హనీ, షేక్ రమీజ్, నూర్జహాన్, జానీ బేగం, సబీనాతోపాటు ఆరేళ్ల హీనా ఉన్నారు. గాయపడ్డ వారిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలపై విచారిస్తున్నామని దర్శి పోలీసులు చెప్పారు. ఆర్టీసీ పెళ్లి బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు. https://t.me/offerbazaramzon
నాగార్జున సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు : ఏడుగురు మృతి
July 11, 2023
0
Tags