కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. జులై 8న కెనడాలో 'ఖలిస్థాన్ ఫ్రీడం ర్యాలీ' నిర్వహిస్తామంటూ పోస్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. కెనడాలోని భారత దౌత్యవేత్తలను ఆ పోస్టర్లలో హంతకులుగా అభివర్ణించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. దీనిపై విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడారు. 'ఆ పోస్టర్లును మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని ఇప్పటికే కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అలాగే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందనపై వచ్చిన కథనాలను మేం చూశాం. ఇక్కడ సమస్య భావ ప్రకటన స్వేచ్ఛ గురించి కాదు. హింసను, వేర్పాటు వాదాన్ని ప్రచారం చేసుకోవడానికి, ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేసుకోవడానికి ఆ స్వేచ్ఛ దుర్వినియోగం అవుతోంది' అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ట్రూడో వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ స్పందన వచ్చింది. 'ఓట్ల కోసమే అతివాద సిక్కు ఖలిస్థాన్ వాదంపై మెతక వైఖరి అవలంబిస్తున్నారని భారత్ ఆరోపిస్తోంది. దీనిపై మీ స్పందన ఏంటి?' అని ట్రూడోను మీడియా ప్రశ్నించగా 'భారత్ చేస్తోన్న ఆరోపణలు తప్పు. హింస, బెదిరింపులను కెనడా తీవ్రంగా పరిగణిస్తుంది. ఉగ్రవాదంపై మేం ప్రతిసారి కఠిన చర్యలు తీసుకున్నాం. అదే తీరు కొనసాగిస్తాం. కెనడా చాలా వైవిధ్యభరిత దేశం. ఇక్కడ భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. కానీ.. హింస, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా చర్యలు తీసుకుంటున్నాం' అని పేర్కొన్నారు. https://t.me/offerbazaramzon
కెనడాలో ఖలిస్థానీ పోస్టర్లపై భారత్ తీవ్ర అభ్యతరం !
July 06, 2023
0
Tags