జూలై 18న ఎన్డీయే కూటమి కీలక సమావేశం ఢిల్లీలోని అశోకా హోటల్‌లో నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి పలు పార్టీలకు ఆహ్వానాలు పంపించేందుకు ఎన్డీఏ సిద్ధమయినట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఏ కూటమికి చెందని మరికొన్ని పార్టీలను ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు పార్టీలతో పొత్తుల కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. కర్నాటకకు చెందిన జేడీఎస్, ఆంధ్రప్రదేశ్ కి చెందిన వైసీపీలతో పొత్తులుంటాయని రాజకీయవర్గాల్లో చర్చ కొనసాగుతుంది. అయితే, ఇటీవల అమిత్ షా నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జేపీ నడ్డాతో కూడా చర్చలు జరిపారు. ఈ లెక్కన ఈ మీటింగ్ కు టీడీపీకి కూడా ఆహ్వానం వస్తుందనే మాట రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్డీయేలో చేరేది ఏ పార్టీ అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. 2018లో ఎన్డీయే నుంచి టీడీపీ పార్టీ వైదొలగింది. గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు వ్యవహరించారు. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. సరిగ్గా ఇదే సమయంలో ఎన్డీయే సమావేశం జరుగుతుంది. దీంతో ఎన్డీఏ సమావేశానికి టీడీపీ పార్టీకి ఆహ్వానం వస్తుందనే ఊహాగానాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. అయితే ఈ సమావేశం తర్వాత ఎన్డీఏలో చేరికపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా.. ఎన్డీఏ మీటింగ్ కి టీడీపీతో పాటు ఎల్‌జేపీ, అకాలీదళ్ తదితర పార్టీలు కూడా హాజరుకాబోతున్నాట్లు తెలుస్తుంది. మరోవైపు.. ఇప్పటికే ఎన్డీఏ ఉన్న భాగస్వామ్య పక్షాలతో పాటు కొత్తగా కూటమిలోకి తీసుకునే వారిని మీటింగ్ కు హాజరుకావాలని బీజేపీ నుంచి ఆహ్వానాలు పంపించనుంది. ఈ క్రమంలోనే టీడీపీ, శిరోమణి అకాళీదళ్, లోక్ జనశక్తి (పాశ్వాన్) సహా మరికొన్ని పార్టీలకు ఆహ్వానం అందినట్లు నేషనల్ మీడియాలో కథనాలు ప్రచారమవుతున్నాయి. https://t.me/offerbazaramzon
జూలై 18న ఎన్డీఏ కీలక సమావేశం ?
July 06, 2023
0
Tags