మణిపూర్ రాష్ట్రాన్ని రాహుల్ గాంధీ సందర్శించడంపై ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ అధికారిమయుం శార్ద దేవి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలని, దానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్న ఆమె, జాతి ఘర్షణల నేపథ్యంలో మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులను రాజకీయం చేయవద్దని కోరారు. ''ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనను అభినందిస్తున్నాను. అయితే పరిస్థితిని పరిష్కరించడం, తిరిగి శాంతిని తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. ఈ అంశాన్ని రాజకీయం చేయకూడదు'' అని దేవి అన్నారు. గురువారం రాహుల్ గాంధీ చురచంద్‌పూర్ జిల్లాలోని సహాయక శిబిరాలను సందర్శించారు. ఆ మరుసటి రోజు బిష్ణుపూర్ జిల్లాలోని మోయిరాంగ్‌లో సందర్శించారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులు, మహిళలు, మేధావులతో సంభాషించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ అనుసూయా ఉకేతో సమావేశమయ్యారు. https://t.me/offerbazaramzon
రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీ చీఫ్ శార్ద దేవి హర్షం !
July 01, 2023
0
Tags