ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 'యూనిఫాం సివిల్ కోడ్' (యూసీసీ) బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ప్రధాని దీనిపై కీలక వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. పలు విపక్షాలు, ముస్లిం, సిక్కు మత సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే యూసీసీపై బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ 'నౌ ఆర్ నెవర్' (ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడుంటూ) వ్యాఖ్యానించారు. విపక్షాలు, కాంగ్రెస్ పార్టీలను లక్ష్యం చేసుకున్న నఖ్వీ, మత రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ హితవు పలికారు. ఈ సమ్మిళిత సంస్కరణకు ఇదే మంచి సమయం అని, అందరికీ సమానత్వం , న్యాయం కోసం యూనిఫాం సివిల్ కోడ్ అవసరం అని అన్నారు. యూసీసీ భారతదేశంలోని అందరి పౌరులకు మతం, కులం, వర్గం ప్రమేయం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత విషయాల్లో ఒకే చట్టాలు ఉండాలని సూచిస్తుంది. తమ సంచుచిత ప్రయోజనాల కోసం గత ఏడు దశాబ్ధాలుగా ''మతవాద కుట్రవాదుల'' నుంచి విముక్తి పొందాలని దేశ అభిప్రాయం అని అన్నారు. 1985లో షాబానో కేసులో కాంగ్రెస్ చేసిన పొరపాటు దేశానికి దశాబ్ధాలుగా శిక్షగా మారిందని నఖ్వీ దుయ్యబట్టారు. ఇప్పటికీ కాంగ్రెస్ ఆ తప్పును దిద్దుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. https://t.me/offerbazaramzon
ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అంటూ యూసీసీపై ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వ్యాఖ్య !
July 01, 2023
0
Tags