మణిపూర్లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడ్ని వీడియో ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. నగ్నంగా ఉన్న ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మాస్క్ లేకుండా వీడియోలో కనిపించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. నగ్నంగా ఉన్న ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మాస్క్ లేకుండా వీడియోలో కనిపించిన వ్యక్తిని 32 ఏళ్ల హుయిరేమ్ హిర్దోస్ మైతీగా పేర్కొన్నారు. పేచీ అవాంగ్ లైకై ప్రాంతానికి చెందిన నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు గురువారం వెల్లడించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. బి ఫైనోమ్ గ్రామంలో కర్రలు వంటి ఆయుధాలు చేతపట్టిన సుమారు 800 మంది మైతీ వర్గానికి చెందిన వారు, గిరిజన వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. వారిపై సామూహిక లైంగిక దాడికి కూడా పాల్పడ్డారు. మే 4న జరిగిన ఈ హేయమైన సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ బుధవారం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇది కలకలం రేపింది. https://t.me/offerbazaramzon
ప్రధాన నిందితుడు అరెస్టు
July 20, 2023
0
Tags