గగన్‌యాన్‌ మిషన్‌ ప్రాజెక్టు కోసం సన్నాహాలు ముమ్మరం !

Telugu Lo Computer
0


భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరో మిషన్‌ను ప్రారంభించింది. ఇటీవల చంద్రయాన్‌-3 విజయవంతంగా నింగిలోకి పంపింది. ప్రస్తుతం భూమి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్‌-3 త్వరలోనే చంద్రుడి వైపుగా పరుగులు తీయనున్నది. ప్రస్తుతం ఈ మిషన్‌ను కొనసాగిస్తూనే మరో ప్రాజెక్టును చేపట్టింది. అదే గగన్‌యాన్‌ మిషన్‌. ఈ ప్రాజెక్టు కోసం సన్నాహాలు ముమ్మరంగా చేస్తున్నది. ఇందులో భాగంగా మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ రీసెర్చ్‌ కాంప్లెక్స్‌లో గగన్‌యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ ని విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఇస్రో ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. గగన్‌యాన్‌ తొలి మిషన్‌ను ఆగస్టు చివరలో ప్రారంభించనున్నది. అయితే, మానవరహిత మిషన్‌ వచ్చే ఏడాది ప్రారంభించనున్నది. ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (పిఆర్‌ఎల్)లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ మాట్లాడుతూ గగన్‌యాన్‌ మిషన్‌ కోసం శ్రీహరికోటలో రాకెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. క్రూ మాడ్యూల్‌, క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ అనుసంధానం ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈ నెలాఖరులోగా ఈ పనులు పూర్తి చేసి అన్ని పరీక్షలు పూర్తి చేస్తామని చెప్పారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)