ఆగస్టు 10 నుంచి విద్యుత్‌ సిబ్బంది సమ్మె

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్‌ సిబ్బంది ఆగస్టు 10 నుంచి నిరవధిక సమ్మె చేయబోతున్నారు. ఈ నెల 27న భోజన విరామంలో నల్ల బ్యాడ్జీలతో నిరసనతో సమ్మె కార్యాచరణ ప్రారంభించి, రిలే నిరాహార దీక్షలు, ఆగస్టు 8న విజయవాడలోని విద్యుత్‌ సౌధ దగ్గర మహాధర్నా నిర్వహిస్తామని ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస నేతలు ప్రకటించారు. ఈ మేరకు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు గురువారం సమ్మె నోటీసు అందజేశారు. 'గతంలో అనేకసార్లు ఉద్యోగ సంఘాలతో డిమాండ్లపై చర్చలు జరిపి, మినిట్స్‌లో పేర్కొన్న అంశాలపై కూడా యాజమాన్యం నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగ సంఘాల నేతలతో గురువారం నిర్వహించాల్సిన సమావేశాన్ని కూడా ఎలాంటి సమాచారం లేకుండా వాయిదా వేసింది. ఉద్యోగుల పట్ల యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సమ్మెకు దిగడం మినహా మరో మార్గం లేదు. విద్యుత్‌ సంస్థల పరిధిలోని అన్ని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, డివిజన్‌, జోనల్‌, ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల కార్పొరేట్‌ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది మొత్తం సమ్మెలో పాల్గొనేలా అన్ని సంఘాల నేతలు కలిసి కార్యాచరణ రూపొందించాం. సమ్మె కారణంగా పరిశ్రమలు, ప్రజలకు తలెత్తే ఇబ్బందుల దృష్ట్యా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస ఇప్పటికీ భావిస్తోంది' అని ఐకాస నేతలు పేర్కొన్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)