బర్డ్‌ఫ్లూ ముప్పు : డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

Telugu Lo Computer
0


క్షీరదాల్లో కొంతకాలంగా బర్డ్‌ఫ్లూ కేసులు తరచూ వెలుగుచూస్తుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. మానవులకూ సోకేలా అది రూపాంతరం చెందే అవకాశం లేకపోలేదంటూ హెచ్చరించింది. సాధారణంగా ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు పక్షుల్లో వ్యాపిస్తాయి. అయితే వాటిలో ఒకటైన బర్డ్‌ఫ్లూ కారక హెచ్‌5ఎన్‌1 ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజాను ఇటీవలి కాలంలో క్షీరదాల్లోనూ గుర్తించారు. దాదాపు 10 దేశాల్లో ఆ కేసులు బయటపడ్డాయి. దీంతో- మనుషులకూ సులువుగా సంక్రమించేలా క్షీరదాల్లో ఈ వైరస్‌ రూపాంతరం చెందే ముప్పుందని డబ్ల్యూహెచ్‌వో బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కొన్ని క్షీరదాల్లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు కలగలిసి.. మానవులు, జంతువులకు హాని కలిగించే కొత్త వైరస్‌లు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)