పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హవా సాగుతోంది. మొత్తం 63,329 గ్రామ పంచాయతీల్లో టీఎంసీ పార్టీ 12,518 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 3,620 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక భాజపా 2,781 స్థానాల్లో గెలుపొంది.. మరో 915 స్థానాల్లో ముందంజలో ఉంది. లెఫ్ట్ ఫ్రంట్ 959 స్థానాల్లో గెలిచి, మరో 550 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 625 స్థానాలను దక్కించుకుని, మరో 276 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇక, 928 జిల్లా పరిషత్ స్థానాల్లో టీఎంసీ 16 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 74వేల పంచాయతీ స్థానాలకు గత శనివారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లోని 339 కేంద్రాల వద్ద కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించారు. రాష్ట్ర, కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మరో రెండు రోజులు పట్టే అవకాశముందని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు ఆ ఎన్నికల్లో చెలరేగిన హింసతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణల నేపథ్యంలో కొన్ని చోట్ల పోలింగ్‌ను నిలిపివేశారు. అలా 696 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్ నిర్వహించారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2018లో జరిగిన బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 34 శాతం సీట్లలో టీఎంసీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మిగతా స్థానాల్లో 90శాతం విజయం సాధించింది. https://t.me/offerbazaramzon
పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ హవా !
July 11, 2023
0
Tags