నందిని పాల ధర పెంపు !

Telugu Lo Computer
0


ర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నందిని పాల ధరను లీటర్ కి రూ.3 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఉత్పత్తులు అన్నింటిని కూడా నందిని పేరుతో మార్కెట్‌ లో విక్రయిస్తూ ఉంటారు.ఇతర బ్రాండ్స్ కూడా అమ్ముతూ ఉంటారు కానీ వాటి ధర ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రభుత్వం అందిస్తున్న నందిని పాలు, ఇతర డైరీ ఉత్పత్తులను పేదలు కొనుగోలు చేసి వినియోగిస్తూ ఉంటారు. అలాంటి నందిని పాలను ఇప్పుడు ధర పెంచి అమ్మబోతున్నట్లుగా స్వయంగా రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పాల ధర రూ.54 నుంచి రూ.56 వరకు ఉంది. అందుకే కర్ణాటక రైతుల కోసం రూ.39 ఉన్న ధరను రూ.42 కి పెంచడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో టోన్డ్ మిల్క్ ను రూ.56 లకు అందిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రజల అవసరాలు నిమిత్తం తక్కువ రేటుకు అందిస్తున్నాం. రైతుల విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)