పశ్చిమ బెంగాల్ లోని మాల్డా జిల్లాలో గోవానరగ్ గ్రామ పంచాయతిలో మంగళవారం ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఒక మహిళా అభ్యర్థి భర్త బ్యాలట్ బాక్సు తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అతడిని వెంటపడి పట్టుకున్నారు ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. బ్యాలెట్ బాక్సు చేత పట్టుకుని పొదల్లోకి పారిపోయిన వ్యక్తి కోసం పోలీసులు పరుగులు తీశారు. చివరకు అతడిని పట్టుకున్న పోలీసులు బడితపూజ చేసి మరీ బ్యాలట్ బాక్సు స్వాధీనం చేసుకుని కౌంటింగ్ కేంద్రానికి చేర్చారు. https://t.me/offerbazaramzon
బ్యాలెట్ బాక్స్ పట్టుకొని పరుగో పరుగు....!
July 11, 2023
0
Tags