విజయవంతమైన చంద్రయాన్-3 ప్రయోగం

Telugu Lo Computer
0


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రయోగం విజయవంతమైంది. ముందుగా అనుకున్న సమయం ప్రకారం.. చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది. రాకెట్ లాంచింగ్ ప్రారంభమైన 40 నిమిషాలకు ఇస్రో తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. చంద్రయాన్-3 ఖచ్చితమైన కక్ష్యలోకి వెళ్లిందని, చంద్రుని దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. అలాగే అంతరిక్ష నౌక సాధారణంగా ఉందని ఇస్రో వెల్లడించింది. సరిగ్గా మధ్యాహ్నం 2.35 గంటలకు కౌంట్‭డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే, వచ్చే నెలలో చంద్రయాన్ -3 జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద దిగితే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా, చంద్రుడిపై సాప్ట్ ల్యాండింగ్‌ను సాధించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది. ఈ రాకెట్‌ ద్వారా 3,900 కిలోల బరువున్న చంద్రయాన్‌-3 పేలోడ్‌ను రోదసీలోకి పంపారు. రాకెట్‌ నుంచి విడిపోయాక వ్యోమనౌకను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకూ మోసుకెళ్లే ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, అక్కడి నుంచి చంద్రునిపై దిగిన తర్వాత పరిశోధనలు చేసేందుకు విక్రమ్‌ ల్యాండర్‌, ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రయాన్‌-3లో ఉన్నాయని ఇస్రో తెలిపింది.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)