ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లా ఫూల్‌బెహార్ బ్లాక్‌లోని అహిరానా గ్రామంలోని ఓ ప్రైమరీ స్కూల్ భవనం గురువారం ఒక్కసారిగా నదిలోకి కొట్టుకుపోయింది. అందరూ చూస్తుండగా కేవలం 17 సెకన్ల వ్యవధితలో స్కూల్ నదితో పాటే కొట్టుకుపోయింది. స్కూల్‌తో పాటే గ్రామంలోని కొన్ని ఇళ్లు ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక నదిలోకి కొట్టుకుపోయాయి. నేపాల్‌లోని కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా వరుణుడు రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్‌గా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో వరద నీరుతో శారదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కేవలం 7 రోజుల్లోనే పదికిపైగా ఇళ్లు, గుడిసెలు, వేల ఎకరాల పంట భూములు వర్షార్పణమయ్యాయి. పరిస్థితిని గమనించిన అధికారులు గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. శరదా నది ఉధృతి వల్ల గత ఐదేళ్లలో సుమారు 200 ఇళ్లు నదిలో కొట్టుకుపోయాయని సమాచారం. ప్రస్తుతం నది ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. https://t.me/offerbazaramzon
నదిలో కొట్టుకుపోయిన ప్రైమరీ స్కూల్ భవనం !
July 14, 2023
0
Tags