చంద్రయాన్-3 కౌంట్ డౌన్ సమయంలో స్వల్ప మార్పు !

Telugu Lo Computer
0



చంద్రయాన్‌-3 కౌంట్ డౌన్ సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం జరగనుంది. మధ్యాహ్నం 2:35 గంటలకు IST ప్రయోగించనుంది. తుది ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. చంద్రయాన్ 3 కోసం 26 గంటలు ఈరోజు మధ్యాహ్నం 1.05 గంటలకు ప్రారంభమవుతాయి. LVM-3-M4 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 ప్రయోగం జరుగనుంది. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండింగ్ కానుందని అంచనా వేస్తున్నారు. చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేయనుంది. సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరికొత్త టెక్నాలజీతో చంద్రయాన్-3 ప్రయోగం అని ఇస్రో చైర్మన్‌ తెలిపారు. మరో వారం రోజుల వ్యవధిలో PSLV-C57 రాకెట్ ప్రయోగం కూడా జరుగనుంది. ఆగస్ట్ చివరి వారంలో ఆదిత్య L1 రాకెట్ ప్రయోగం కూడా ఉంటుందని వెల్లడించారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)