ఫ్రాన్స్‌ పర్యటనకు బయలుదేరిన ప్రధాని

Telugu Lo Computer
0


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం జరుగనున్న ఫ్రాన్స్ దేశ నేషల్ డే వేడుకల్లో పాల్గొంటారు. ఈ పర్యటన సందర్భంగా స్పేస్, రక్షణ రంగాలకు సంబంధించిన పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవమైన బాస్టిల్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా ఆ దేశ ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెల్సిందే. నిజానికి బాస్టిల్ డే వేడుకలకు విదేశీ నేతలకు ఫ్రాన్స్ సాధారణంగా ఆహ్వానం అందించదు. అయితే, భారత ప్రధాని హోదాలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ వేడుకలు హాజరుకావడం ఇదే రెండోసారి కావడం గమనార్హం. ఈ వేడుకల్లో భాగంగా, శుక్రవారం జరిగే నేషనల్ డే లో యూరప్‌లోనే అతిపెద్ద సైనిక కవాతుగా పేరుగాంచిన ఈ పరేడ్‌లో మోడో గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ పరేడ్‌లో భారత సైనిక బృందాలు కూడా పాల్గొంటుండటం గమనార్హం. ప్రధాని మోడీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు అధికారి విందుతో పాటు ప్రైవేటు విందు కూడా ఇవ్వనున్నారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)