చెన్నై-న్యూఢిల్లీ సూపర్ ఫాస్ట్ రైలు సాంకేతిక సమస్య కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని తడ-సూళ్లూరుపేట మధ్య నిలిచిపోయింది. సరిగ్గా కళింగ నది వంతెనపై ఆగిపోయింది. దీనిని సరిచేసేందుకు లోకో పైలట్ డ్రైవర్ చేసిన సాహసం ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంది. ఆ సాహసం సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ స్పాట్ అవార్డును అందుకుంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సీహెచ్‌వీపీ ఫణిబాబు రైల్వే డిపార్ట్ మెంట్ లో సీనియర్ అసిస్టింట్ లోకో పైలట్‌గా విజయవాడ డిపోలో పనిచేస్తున్నాడు. ఈ నెల 22న చెన్నై- న్యూఢిల్లీ సూపర్‌ఫాస్ట్ రైళ్లో డ్యూటీలో ఉన్నారు. చెన్నై నుండి బయలుదేరిన ట్రైన్ తడ-సూళ్లూరుపేట మధ్యలో ఓ ప్రయాణికుడు చైన్ లాగడంతో నిలిచిపోయింది. అదికూడా సరిగ్గా కళింగ నది వంతెనపై ఆగిపోయింది. సాంకేతిక లోపాన్ని సరిచేయడం సాధ్యపడలేదు. వాక్యూమ్ పోతోంది. సంబంధిత బోగీ దిగువ నుండే ఐసోలేషన్ కాక్‌ను లాక్ చేయాలి. అది చేయాలంటే కిందకు దిగి చేయాలి. కానీ ట్రైన్ ఆగిపోయిన దగ్గర ఎలాంటి సైడ్ పాత్ వే లేదు. కిందికి దిగే పరిస్థితి లేదు. దీంతో సిబ్బంది ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడ్డారు. పరిస్థితిని గమనించిన రైలు డ్రైవర్ ఫణిబాబు రైలు ఇంజన్‌లోంచి ఆ కోచ్‌కు వెళ్లి ఐసోలేషన్ కాక్‌ను లాక్ చేయడానికి సిద్దమయ్యారు. ఇది తన పని కాకున్నా కూడా చేయడానికి పూనుకున్నాడు. వంతెనపైనున్న రైలుకు ఫుట్ బోర్డ్ మెట్లను, బోగీ హ్యాండిల్స్ ను హత్తుకుని కిందికి వేలాడి ధైర్యం చేసి ఐసోలేషన్ కాక్‌ను లాక్ చేసి వ్యాక్యూమ్‌ను నిరోధించాడు. తను ఏ మాత్రం చేజారినా కూడా నదిలో పడి ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఉంది. ఈ పనిని 15 నిమిషాల్లో పూర్తి చేశాడు. ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని తన విధి కానప్పటికీ, ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ఈ సాహసానికి పూనుకున్నాడు. దీంతో జీటీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత వచ్చే రైళ్లకు అడ్డంకులు కలగకుండా చేశారు. ఫణిబాబు సాహసం తెలుసుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం శివేంద్రమోహన్, సీనియర్ డీసీఈ కొండా శ్రీనివాసరావు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ' డీఆర్ఎం స్పాట్ అవార్డు'ను ప్రకటించారు. https://t.me/offerbazaramzon
ప్రాణాలకు తెగించి రైలును కదిలించిన లోకో పైలట్ !
June 30, 2023
0
Tags