వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు !

Telugu Lo Computer
0


మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ కాబడి చంచల్ గూడ జైల్లో ఉన్న ఆరుగురు నిందితులకు సీబీఐ కోర్టు రిమాండ్ పొడిగించింది. నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి రిమాండును జులై 14 వరకు సీబీఐ కోర్టు పొడిగించింది. కాగా వీరి రిమాండ్ నేటితో ముగియగా, పోలీసులు ఇవాళ సీబీఐ కోర్టులో హాజరు పరిచారు. దీనితో విచారణ జరిపిన కోర్టు నిందితుల రిమాండును పొడిగించింది. కాగా ఇదే కేసులో సీబీఐ అనుబంధ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఇప్పటివరకు రెండు ఛార్జ్ షీట్ లు దాఖలు చేయగా తాజాగా మూడో ఛార్జ్ షీట్ ను సీబీఐ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై దాఖలు చేసింది. ఈ కేసులో కీలకంగా మారిన వివేకా రాసిన లేఖను నిన్ హైడ్రిన్ పరీక్ష చేసేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. హత్యకు ముందు వివేకా రాసిన లేఖగా దీనిని చెబుతుండగా..వేలిముద్రలను గుర్తించడానికి ఈ పరీక్ష చేయలని సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు నిన్ హైడ్రిన్ పరీక్ష చేసేందుకు అనుమతి ఇచ్చింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)