ఎన్‌హెచ్‌ఆర్‌సి ప్రతిపాదనను తిరస్కరించిన బెంగాల్‌ హైకోర్టు

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికల పర్యవేక్షణకై స్వతంత్య్ర అభ్యర్థిని నియమించాలన్న ఎన్‌హెచ్‌ఆర్‌సి ప్రతిపాదనను కోల్‌కతా హైకోర్టు తిరస్కరించింది. అలాగే బ్లాక్ డెవలప్ మెంట్ అధికారిపై సిబిఐ విచారణపై ఆదేశాలను రిజర్వ్‌ చేసినట్లు జస్టిస్ సబ్యసాచి భట్టాచార్య శుక్రవారం తీర్పునిచ్చారు. జులై 8న పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించే పంచాయితీ ఎన్నికల పర్యవేక్షణ కోసం స్వతంత్ర అభ్యర్థిని నియమించాలని జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. నామినేషన్‌ల దశలో బెంగాల్‌లో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో.. ఈ కేసును ఎన్‌హెచ్‌ఆర్‌సి సుమోటోగా స్వీకరించింది. కమిషన్‌కి చెందిన డైరెక్టర్‌ జనరల్‌ (విచారణ) దామోదర్‌ సారంగియాస్‌ను పర్యవేక్షకుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇద్దరు సిపిఎం అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తారుమారు చేశారంటూ బ్లాక్ డెవలప్ మెంట్ అధికారిపై సిబిఐ విచారణ చేపట్టాలని కోల్ కతా హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన బెంగాల్‌ స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ (డబ్ల్యుబిఎస్‌ఇసి) హైకోర్టును ఆశ్రయించింది. ఎన్‌హెచ్‌ఆర్‌సికి పర్యవేక్షకుడిని నియమించే హక్కు, సున్నితమైన ప్రాంతాలను గుర్తించే హక్కు లేదని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)