ఉపాధ్యాయుడ్ని పిస్టల్ తో కాల్చిన విద్యార్థులు !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా జౌరా రోడ్ ప్రాంతంలో గిర్వార్ సింగ్‌ అనే టీచర్ ను విద్యార్థులు ఇంటి బయట నుంచి పిలిచారు. ఉపాధ్యాయుడు బయటికి రాగానే ఎలా ఉన్నారంటూ చర్చను ప్రారంభించారు. ఇంతలోనే ఓ యువకుడు జేబులోంచి పిస్టల్ తీసి కాల్చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితున్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులు గత మూడేళ్ల క్రితం వరకు గిర్వార్ సింగ్ కోచింగ్‌ సెంటర్‌లో విద్యను నేర్చుకున్నారు. అందుకు సంబంధించిన ఫీజులు మాత్రం చెల్లించలేదు. పలు సందర్భాలలో ఆ డబ్బులపై విద్యార్థులను గిర్వార్ సింగ్ ప్రశ్నించారు. దీంతో కక్ష పెంచుకున్న నిందితులు దాడికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)