రెండు బల్బులు, ఒక ఫ్యాన్ కు 1,03,315 బిల్లు !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని కొప్పల్‌లోని భాగ్యనగర్‌లో గిరిజమ్మ అనే వృద్ధురాలు(90) ఓ చిన్న రేకుల షెడ్‌లో నివసిస్తోంది. ఆమెకు భాగ్యజ్యోతి పథకం కింద విద్యుత్తు కనెక్షన్‌ ఉంది. ఈ పథకం కింద దారిద్ర్యరేఖకు దిగువనున్న రేషన్‌కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్తును అందిస్తోంది. ఈ పథకం కింద ఆమెకు 18 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు లభిస్తుంది. అందువల్ల ప్రతినెల రూ.70 నుంచి రూ.80 వరకు కరెంటు బిల్లు వస్తుందని గిరిజమ్మ తెలిపింది. మే నెల బిల్లు రూ. లక్ష వచ్చిందని తెలిపింది. గుల్బర్గా ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్‌  అధికారులకు ఈ విషయం తెలియజేసినా తొలుత పట్టించుకోలేదని బిల్లు ఎంత వస్తే అంతే కట్టామన్నారని చెప్పింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి నిరసన తెలపడంతో అధికారులు బాధితురాలి గృహాన్ని సందర్శించారు. ఆమె ఇంట్లో ఉన్న మీటరులో తప్పిదం కారణంగానే ఎక్కువ బిల్లు వచ్చిందన్నారు. మీటరులో లోపాన్ని సరిచేసి సరైన బిల్లు ఇచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)