ప్రతి ఒక్కరిని సాధరణంగా వేధించే సమస్య తలనొప్పి. ఒత్తిడి సహా అనేక కారణాల వల్ల తలనొప్పి రావొచ్చు. కొన్నిసార్లు రోజుల తరబడి వేధిస్తుంటుంది. తల పగిలిపోయినట్లు అనిపించే ఈ బాధ నుంచి బయటపడేందుకు చాలామంది నొప్పి నివారణ బామ్‌లు, పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకుంటుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సులభంగా, ఇంటి చిట్కాలతోనే తలనొప్పి నుంచి సత్వర ఉపశమనం పొందవచ్చు. నీటిని తగినంత తీసుకోకపోయినా తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి రోజుకు 8-10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి. ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది. గోరు వెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పి నివారణిగా పనిచేస్తుందట!. బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు జీడిపప్పు, బాదం వంటి డైఫ్రూట్స్‌ను గుప్పెడు తింటే తలనొప్పి తగ్గుతుందట. మెగ్నీషియం లోపంతో కూడా తలనొప్పి వేధిస్తుంది. అందుకని మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. మంచినీటిలో ధనియాలు, చక్కెర కలిపి తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గంధం చెక్కను అరగదీసి నుదిటిపై రాయడం ద్వారా కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. నిత్యం క్రమం తప్పకుండా 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. దీంతో పాటు వేళకు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలని కలిగి ఉంటుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు అల్లం టీని తాగడం వల్ల ఇన్‌స్టెంట్ రిలీఫ్ లభిస్తుంది.
తలనొప్పి - నివారణోపాయాలు !
June 17, 2023
0
Tags