రోడ్డు ప్రమాదంలో ట్రీట్ విలియమ్స్ దుర్మరణం

Telugu Lo Computer
0


హాలీవుడ్ స్టార్ హీరో ట్రీట్ విలియమ్స్  రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించినట్లు ది హాలీవుడ్ రిపోర్టర్ తెలిపింది. కొలరాడోలో బైక్‌పై వెళ్తోండగా అదుపు తప్పిన ఓ కారు ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా  చికిత్స పొందుతూ మరణించినట్లు పేర్కొంది. 120కి పైగా సినిమాల్లో నటించారాయన. 1975లో డెడ్లీ హీరోతో సినిమాల్లో అరంగేట్రం చేశారు. 1979లో విడుదలైన 1941 మూవీ మంచి పేరు తీసుకొచ్చింది. ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 120 సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోల్లో నటించాడు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోన్నారు. ప్రిన్స్ ఆఫ్ ది సిటీ, హెయిర్, వన్స్ అపాన్‌ ఎ టైమ్ ఇన్ అమెరికా, డెడ్ హీట్, థింగ్స్ టు డు ఇన్ డెన్వర్ వెన్ యుఆర్ డెడ్, డీప్ రైజింగ్, ది ఫాంటామ్, ఎవర్‌వుడ్, ది డెవిల్స్ ఓన్, ది సబ్‌స్టిట్యూట్ సిరీస్, హాలీవుడ్ ఎండింగ్, మిస్ కాంజినియాలిటీ 2: ఆర్మ్డ్ అండ్ ఫాబ్యులస్ వంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. హెయిర్ సినిమాతో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌ను సైతం అందుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)