758 కిలోల గంజాయి పట్టివేత !

Telugu Lo Computer
0


హర్యానా హిసార్‌ జిల్లాకు చెందిన జీవన్‌సింగ్ జైపూర్‌కు చెందిన చంద్రశేఖర్‌, హైదరాబాద్‌కు చెందిన పర్వేజ్‌తో కలిసి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇదే క్రమంలో తాజాగా షోలాపూర్‌కు భారీగా గంజాయిను స్మగ్లింగ్ చేశాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గోలూ అంకిత్‌సింగ్‌తో కలిసి డీసీఎంలో 758 కిలోల గంజాయిను తరలించారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండడానికి పైన తౌడుబస్తాలు వేశారు. ఈ క్రమంలోనే తనిఖీలు చేపట్టిన షాపూర్‌ నగర్‌ పోలీసులు అనుమానం వచ్చి కాస్త లోతుగా వెతికారు. దీంతో లోపల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 2.35 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. జీవన్‌సింగ్‌, అంకిత్‌సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)