వివాదాస్పద వ్యాఖలు చేసిన నటి శృతి మీద కేసు నమోదు !

Telugu Lo Computer
0


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మూడు ప్రధాన పార్టీలలోని కొందరు నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో కొందరు నాయులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల మీద, వ్యక్తిగతంగా ఒకరిని ఒకరు దూషించుకోకూడదని, ఎన్నికల నియమాలు పాటించాలని ఎన్నికల కమీషన్ అధికారులు సూచించారు. ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తున్న వారి మీద ఎన్నికల కమీషన్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. కేసులు నమోదు అవుతున్నారు కొంత మంది నాయకులు మాత్రం తగ్గేదే లే అంటున్నారు. కర్ణాటకలోని హావేరి జిల్లాలోని హీరేకరూరులో బీజేపీ మహిళా మోర్చ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. బహుబాష నటి, అలనాటి హీరోయిన్, బీజేపీ నాయకురాలు శృతి ఈ కార్యక్రమానికి హాజరైనారు. ఈ సందర్బంగా నటి శృతి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో, కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంటేనే ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారని నటి శృతి చెప్పారు. మన జీవితాలు బాగుండాలి, ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని అనుకుంటే కర్ణాటకలో మరోసారి బీజేపీని ఆధరించాలని నటి శృతి ఓటర్లకు మనవి చేశారు. నేను ఒకే ఒక్కమాటలు చెప్పి నా ప్రసంగం పూర్తి చేస్తానని నటి శృతి అన్నారు. మీ వంశం కాకుండా వేరే వంశం అభివృద్ది కావాలంటే జేడీఎస్ పార్టీకి ఓటు వెయ్యండి, మీ వంశాన్ని గాలికి వదిలేసి విదేశీ వంశం అభివృద్ది కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యండి, మీ వంశంతో పాటు మీ దేశం అభివృద్ది కావాలంటే బీజేపీకి ఓటు వెయ్యండి అంటూ నటి శృతి బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బహిరంగంగా ఇతర పార్టీలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ప్రజల మధ్య, మూడు పార్టీల కార్యకర్తల మధ్య విధ్వేషాలు రెచ్చెగొట్టేలా వ్యాఖ్యలు చేశారని నటి శృతి మీద హీరోకరూరు నోడల్ అధికారి పంపావతి ఫిర్యాదు చెయ్యడంతో నటి మీద స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)