రాజస్థాన్ లో విగ్రహ ప్రతిష్టాపనపై రగడ

Telugu Lo Computer
0


రాజస్థాన్ ‎లోని భరత్‎ పూర్ ‎లో విగ్రహ ప్రతిష్టాపనపై తీవ్ర దుమారం చెలరేగింది. వీధుల్లోకి వచ్చిన జనం షాపులను దగ్దం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన గ్రామస్థులు పోలీసుల వాహనాలపై కూడా రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీంతో అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా భరత్ పూర్ లో విగ్రహ రాజకీయాలు షురూ అయ్యాయి. ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగేంద్ర సింగ్ అవానా ప్రకటించారు. అదే సమయంలో భరత్ పూర్ స్థాపకుడు మహారాజా సూరజ్మల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జాట్ కమ్యూనిటీ డిమాండ్ చేసింది. దీంతో బుధవారం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జాట్ కమ్యూనిటీ ధర్నాకు దిగింది. లోనైన కాంగ్రెస్ వర్గీయలు, జాట్ కమ్యూనిటీపై దాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు రెచ్చిపోయారు. వీధుల్లో విధ్వంసం స్రుష్టించారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రావడంతో వారిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు.


Post a Comment

0Comments

Post a Comment (0)