బటిండాలో మళ్లీ కలవరం

Telugu Lo Computer
0


చండీగఢ్‌ః బుధవారం తెల్లవారుజామున పంజాబ్‌ లోని బటిండా సైనిక స్థావరం లో కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాగా, తాజాగా బుల్లెట్‌ గాయాలతో మరో జవాను ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు గురువారం వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున కాల్పులు జరిగిన కొద్ది గంటల్లోనే చోటు చేసుకున్న మరో ఘటనలో జవాను ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అయితే, తాజా ఘటనకు అంతకుముందు జరిగిన కాల్పులతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే జవాను ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఏదైనా ప్రమాదం జరిగిందా..? అన్నదానిపై స్పష్టత లేదు. ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో మరణించినట్లు ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)