ఢిల్లీకి చెందిన బీజేపీ నేత సురేంద్ర మటియాలా పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే శుక్రవారం ఆయన రాత్రి 7 గంటల సమయంలో ద్వారాకలోని తన ఆఫీసులో టీవీ చూస్తూ కూర్చున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి సురేంద్ర మటియాలాతో మాట్లాడాలని లోపలికి వచ్చారు. ఇక ఆఫీసులోకి వెళ్లి అతనితో మాట్లాడుతున్నట్లు నటించి సురేంద్ర మటియాలాపై ఒక్కసారిగా దాడి చేశారు. ఈ దాడిలో అతడు కిందపోయాడు. వెంటనే ఆ దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఆఫీసు సిబ్బంది వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలంచి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సురేంద్ర మటియాలాను ఎందుకు హత్య చేశారు? ఎవరు హత్య చేశారనే పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
April 15, 2023
0
Tags