ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏప్రిల్ 14న సీబీఐ కేజ్రీవాల్ కు సమన్లు పంపింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 16 న తాను సీబీఐ విచారణకు హాజరు అవుతానని చెప్పారు. తనని అరెస్ట్ చేయమని సీబీఐ ని బీజేపీ ఆదేశిస్తే.. సీబీఐ కచ్చితంగా పాటిస్తుందన్నారు కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీలో అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడిన రోజు నుంచి సీబీఐ, ఈడీ సమన్లు పంపే వరుసలో తాను ఖచ్చితంగా ఉంటానని తనకు తెలుసునని తెలిపారు సీఎం కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర ఏజెన్సీలు తమపై కోర్టులకు అబద్ధాలు చెబుతున్నాయని.. అరెస్టు చేసిన వ్యక్తులను చిత్రహింసలకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.
బీజేపీ ఆదేశిస్తే - సీబీఐ పాటిస్తుంది !
April 15, 2023
0
Tags